Monday 16 January 2023

UGC NET Application: యూజీసీ నెట్-2023 దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

 UGC NET Application: యూజీసీ నెట్-2023 దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!


 యూజీసీ నెట్-2022 డిసెంబరు దరఖాస్తు గడువు జవనరి 17తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

జనవరి 17న సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అశకాశం ఉంది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 


పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 29న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

దరఖాస్తు ఫీజు:జనరల్-రూ.11,00; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్)-రూ.550; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్-రూ.275 చెల్లించాలి.

పరీక్షలు ఎప్పుడంటే?
యూజీసీ నెట్-2022 డిసెంబరు పరీక్షలను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది. మొదటి షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

ఇలా దరఖాస్తు చేసుకోండి..

➥ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. - ugcnet.nta.nic.in.


➥ అక్కడ హోంపేజీలో కనిపించే UGC NET 2022 లింక్ పై క్లిక్ చేయాలి.

➥ స్క్రీన్పై వచ్చిన పేజీలో వివరాలను నింపి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. దాంతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

➥ ఆ తరువాత, మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. UGC NET 2022 అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయాలి.

➥ అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి, ఆన్లైన్లో ఫీ చెల్లించాలి.

➥ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలి.

పరీక్ష విధానం..

➥ ఆన్లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.

➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. 

ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలివే..

➥ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 29.12.2022.

➥ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేది: 17.01.2023 (5 PM)

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 18.01.2023 (11.50 PM)

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 19-20.01.2023 (11.50 PM)

➥ ఎగ్జామ్ సిటీ వివరాల వెల్లడి: 2023 ఫిబ్రవరి మొదటివారంలో.


➥ అడ్మిట్కార్డు డౌన్లోడ్: 2023 ఫిబ్రవరి రెండోవారంలో.

➥ UGC NET 2023 పరీక్షలు: 21.02.2023 - 10.03.2023.


UGC NET Application: యూజీసీ నెట్-2023 దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

0 comments:

Post a Comment

Recent Posts