Uric Acid symptoms: శరీరంలో యూరిక్ యాసిడ్ అత్యంత ప్రమాదకరం, ఈ లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త
యూరిక్ యాసిడ్ చాలా ప్రమాదకరమైంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దు. యూరిక్ యాసిడ్ పెరిగితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి.
అందుకే యూరిక్ యాసిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
శరీరంలో కిడ్నీలు సాధారణంగా యూరిక్ యాసిడ్‌ను ఫిల్టల్ చేసి బయటకు పంపించేస్తాయి. కిడ్నీలు విఫలమై ఆ పని జరగనప్పుడు ఆ యూరిక్ యాసిడ్ నేరుగా రక్తంలో కలిసిపోతుంది. దాంతో స్థూలకాయం, ఎముకల స్వెల్లింగ్, తిరిగేటప్పుడు నొప్పులు ఎదురౌతాయి.
యూరిక్ యాసిడ్ పెరిగితే శరీరంలోని పలు భాగాల్లో నొప్పులు తలెత్తుతాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల శరీరంలోని ఏయే భాగాల్లో నొప్పులుంటాయో తెలుసుకుందాం..
ఎక్కువసేపు వజ్రాసనం వేయాలంటే ఇలా చేయాలి
యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు
మోకాలి నొప్పులు
యూరిక్ యాసిడ్ పెరిగితే మోకాళ్లలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ సమస్య అదేపనిగా ఉంటుంది. ఎందుకంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్లు లాగుతుంటాయి. దాంతో మోకాలి నొప్పులు సంభవిస్తాయి.
ఈ నొప్పి ఒక్కోసారి ఎంత తీవ్రంగా ఉంటుందంటే కనీసం అడుగేయలేని పరిస్థితి ఉంటుంది. మీక్కూడా ఈ ఇబ్బంది తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మడమ నొప్పులు
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే క్రిస్టల్ రూపంలో ఎముకల్లో పేరుకుపోతుంది. ఎముకల మధ్యలో పేరుకుపోవడం వల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది. మీక్కూడా ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది యూరిక్ యాసిడ్ సమస్య కావచ్చు.
నడుము నొప్పి
నడుములో నొప్పి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు నడుము భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది.
మెడ నొప్పి
మెడనొప్పి సాధారణమైన లక్షణమే అయినా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మెడభాగంలో నొప్పి లేదా పట్టేసినట్టుంటే యూరిక్ యాసిడ్ సమస్య కావచ్చు.
0 comments:
Post a Comment