Brahma Muhurtham: బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? ఎప్పుడు నిద్రలేవాలి? ప్రయోజనాలేంటి?
Brahma Muhurtham: హిందూ ధర్మంలో పంచాంగానికి ఎంతో విలువ ఉంటుంది. ముహూర్తం చూసుకోనిదే ఏ పని చేయడానికి ఇష్టపడరు. అందులో బ్రహ్మ ముహూర్తం మంచిదని భావిస్తారు.
ఆ మూహూర్తంలో ఏ పని చేసినా విజయం దక్కుతుందని అనుకుంటారు. ఉదయం పూట కూడా బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలంటారు. ఆ సమయంలో నిద్ర లేస్తే మంచి లాభాలుంటాయని విశ్వసిస్తారు. అదే సరైన సమయంగా చెబుతారు.
ఉదయం నాలుగు గంటల సమయంలో చేసే స్నానం రుషి స్నానం, ఐదు గంటలకు చేసేది గాంధర్వ స్నానం, ఇక ఆరు గంటలకు చేసేది రాక్షస స్నానంగా అభివర్ణిస్తారు. ఇలా ఉదయం పూట మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Brahma Muhurtham
బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి?
బ్రహ్మ ముహూర్తం అంటే దేవతలు భూలోకానికి దిగి వచ్చే సమయంగా నిర్ణయించారు. ఆ సమయంలో దేవాలయాల తలుపులు తెరుచుకుని ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో దేవతలకు నమస్కరిస్తారు.
సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి దేవతలను పూజించాలని చెబుతారు. దీని వల్ల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. బ్రహ్మ ముహూర్తం అంటే ఆరోగ్యానికి మనసుకు బాగుంటుంది. ఉదయం 4 నుంచి 5.30 మధ్య నిద్ర లేవడం వల్ల శరీరం మనసు రెండు ప్రశాంతంగా ఉంటాయి. ఈ సమయంలో నిద్ర లేచే వారికి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
ఆరోగ్యం బాగుంటుంది
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఆక్సిజన్ అందడంతో శరీర భాగాలు బాగా పనిచేస్తాయి. ఊపిరితిత్తులకు ఎంతో మేలు. ఆ సమయంలో లేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
ధ్యానం చేస్తే ఇంకా ఎన్నో లాభాలుంటాయి. మనసు బాగుంటే అన్ని సరిగా పనిచేస్తాయి. దీంతో ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఏవైనా రోగాలున్నా చల్లని గాలికి మాయమవుతాయి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర నుంచి మేల్కోవడం చాలా మంచిదని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
జ్ణాపక శక్తి పెరుగుతుంది
మనం చిన్నప్పుడు మన పెద్దలు చెప్పే వారు ఉదయం పూట లేచి చదువుకుంటే మంచిగా ఒంటపడుతుంది ని చెప్పేవారు. ఇది నిజమే. ఎందుకంటే ఆ సమయంలో మనం ఏ పని చేసినా అడ్డంకులు ఉండవు. శబ్ధాలు రావు. దీంతో చదివింది బాగా అర్థమై మన మెదడులో నిలిచిపోతుంది. అందుకే ఉదయం పూట లేచి చదువుకోమని చెప్పేవారు.
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఏ పని చేసినా అది నూటికి నూరుపాళ్లు బాగుంటుంది. చాలా మంది ఇదే సమయంలో లేచి చదువుకుని తమ జ్ణాపకశక్తిని పెంచుకుంటారు.
Brahma Muhurtham
మంచి నిద్రకు మార్గం
ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు. దీంతో రాత్రి పూట సరిగా నిద్ర పోకపోవడంతో అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఎక్కువ గంటలు నిద్రపోయినా గాఢ నిద్రలోకి జారుకోవడం లేదు. ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల రాత్రి మంచి నిద్ర పోయేందుకు అవకాశం ఏర్పడుతుంది.
క్రమశిక్షణ అలవడుతుంది
రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే పడుకోవడం కూడా తొందరగానే అలవడుతుంది. దీంతో నిద్ర లేమి సమస్య పోవడమే కాకుండా క్రమశిక్షణ కూడా అలవడుతుంది.
జీవితంలో ఏదైనా సాధించాలంటే మొదట క్రమశిక్షణ చాలా అవసరం. త్వరగా నిద్ర లేచి తొందరగా పడుకోవడం అలవాటు చేసుకుంటే ఉత్తమం.
మనకు మంచి అలవాట్లు వచ్చినట్లే. ఇలా ఉదయం పూట నిద్ర లేవడం వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయని తెలుసుకోవాలి.
0 comments:
Post a Comment