Thursday, 2 March 2023

Beauty Tips: కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్‌.. పిగ్మెంటేషన్‌కు చెక్‌! ముఖం మెరిసేలా..

Beauty Tips: కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్‌.. పిగ్మెంటేషన్‌కు చెక్‌! ముఖం మెరిసేలా..


స్‌క్యూబ్స్‌తో చర్మానికి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు. చర్మం, మెడ మీద ఉండే నొప్పులు తగ్గిపోతాయి. దీంతోపాటు నలుపు మచ్చలు, ముఖం మీద పేరుకున్న మట్టి తొలగిపోతాయి.



రక్త ప్రసరణ మెరుగవటంతో పాటు చర్మంలోని నూనె శాతాన్ని తగ్గించే ఈ ఐస్‌ క్యూబ్స్‌ బ్యూటీ టిప్స్‌ను తెలుసుకుందాం.

తులసి, అలొవెరా జెల్‌
ఒక బౌల్‌లో నీళ్లు తీసుకుని అందులో గుప్పెడు తులసి ఆకుల్ని నలిపి వేయాలి.
ఆ తర్వాత రెండు స్పూన్ల అలొవెరా జెల్‌ను వేసి బాగా కలపాలి.
ఆ నీటిని ఐస్‌క్యూబ్స్‌ ట్రేలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఈ ఐస్‌క్యూబ్స్‌తో చర్మాన్ని రుద్దితే ముఖ చర్మం తాజాగా మెరవడంతోపాటు వేడివల్ల వచ్చిన మచ్చలు తొలగి పోతాయి.

స్పిన్‌ ఇన్ఫెక్షన్స్‌ రాకుండా
ఐస్‌క్యూబ్స్‌ ట్రేలో ఒక కప్పు రోజ్‌వాటర్‌తో పాటు కప్పు మంచి నీళ్లు కలపాలి. దీనిని ఫ్రీజర్‌లో ఉంచాలి.
ఆ ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా చర్మంపై రుద్దితే ముడతలు తగ్గిపోతాయి. స్కిన్‌ ఇన్ఫెక్షన్స్‌ దరి చేరవు.
దీంతోపాటు ముఖం ఫ్రెష్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది.

దోసకాయ ముక్కలతో
ఒక బౌల్‌లో మెత్తగా దంచిన దోసకాయ ముక్కలను వేయాలి. దీనికి ఐదారు చుక్కల నిమ్మరసం కలపాలి.
ఇందులో ఐస్‌క్యూబ్స్‌ వేసి కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి.. తీసిన తర్వాత వీటితో ముఖంపై రబ్‌ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ సాఫీగా జరిగి నొప్పులు, మొటిమలు తగ్గిపోతాయి. కమిలినట్లుగా ఉన్న ముఖం తాజాగా మారుతుంది.

కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌తో
చర్మ సౌందర్యానికి కుంకుమ పువ్వుకి సాటి లేదు.
కుంకుమ పువ్వును కొంచెం రోజ్‌ వాటర్‌లో కలపాలి.
ఈ రెండిటినీ బాగా కలిపాక.. ఐస్‌ క్యూబ్స్‌ ట్రేలో వేసి క్యూబ్స్‌ తయారు చేసుకోవాలి.



వాటితో ముఖం మీద సున్నితంగా మర్దన చేస్తే పిగ్మెంటేషన్‌ , నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. ముఖ్యంగా స్కిన్‌టోన్‌ మారిపోతుంది.

Beauty Tips: కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్‌.. పిగ్మెంటేషన్‌కు చెక్‌! ముఖం మెరిసేలా..

0 comments:

Post a Comment

Recent Posts